Rashmika: కాంచన4లో రష్మిక?

హార్రర్ కామెడీ సినిమాల్లో బాగా హిట్ అయిన ఫ్రాంచైజ్ అంటే వెంటనే గుర్తొచ్చేది కాంచన సిరీసే. కామెడీకి కామెడీకి, హార్రర్ కు హార్రర్ ఉంటూనే వీటన్నింటితో పాటూ మెసేజ్ కూడా ఉండేలా లారెన్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ముని(muni)తో మొదలైన ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికే పలు సినిమాలు రాగా అవన్నీ ఆడియన్స్ ను అలరించడంతో పాటూ మంచి హిట్లు గా నిలిచాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాఘవ లారెన్స్(Raghava Lawrance) ప్రస్తుతం కాంచన4(kanchana4) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి షూటింగ్ ను చేస్తున్న లారెన్స్ ఈ మూవీ కోసం పూజా హెగ్డే(Pooja Hegde)ని ప్రధాన పాత్రలో తీసుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి(nora fathehi) కూడా కాంచన4లో కీలక పాత్రలో నటించనుండగా ఇప్పుడీ సినిమా గురించి కోలీవుడ్ సర్కిల్స్ లో ఓ టాక్ వినిపిస్తోంది.
కాంచన4లో నేషనల్ క్రష్ రష్మిక(National crush rashmika) కూడా నటిస్తున్నారని, ఈ సినిమాలో పూజాతో పాటూ రష్మిక కూడా దెయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ఓ స్పెషల్ రోల్ కోసం లారెన్స్, రష్మికను సంప్రదించగా, రష్మిక ఓకే అన్నారని సమాచారం. ఇదే నిజమైతే ఈ సినిమా క్యాస్టింగ్ తోనే భారీ హిట్ అవడం గ్యారెంటీ అనేలా ఉంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.