Rashmika: ఛాలెంజింగ్ రోల్ లో రష్మిక
యానిమల్(Animal), పుష్ప2(Pushpa2) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న రష్మిక మందన్నా(Rashmika Mandanna) వచ్చే నెలలో చావా(Chaava) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విక్కీ కౌశల్(Vicky Kaushal) హీరోగా రూపొందుతున్న ఈ హిస్టారికల్ డ్రామా మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది.
లక్ష్మణ్ ఉతేకర్(lakshman uthekar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రష్మిక చేస్తున్నది శంభాజీ భార్య యేసుబాయ్ బోన్సాలే పాత్ర. 1730 వరకు ఈవిడ జర్నీ సాగింది. మరాఠా సామ్రాజ్యపు మహారాణిగా ఈమె గురించి ఎన్నో వీరగాథలు ప్రచారంలో ఉన్నాయి. యేసుబాయ్ మరాఠా సామ్రాజ్యానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి.
శంభాజీ చనిపోయాకి రాయగడ్ సంస్థానాన్ని కాపాడుకోవడానికి ఈమె చేసిన యుద్ధం గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే రష్మికకు ఇది చాలా ఛాలెంజింగ్ రోల్ అని చెప్పొచ్చు. చావాలో రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని అర్థమవుతుంది. చూస్తుంటే 2025లో రష్మిక జోరు మామలూగా ఉండేట్లు లేదు.













