నయన్‌ను ఫాలో అవుతున్న రష్మిక
ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. అయితే రష్మిక తన కెరీర్ ప్లానింగ్ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతారను ఫాలో అవుతుందని అంటున్నారు చాలా మంది.
తమిళంలో తప్ప ఏ భాషలోనూ సినిమాలు చేయకుండా అక్కడే కమర్షియల్ సినిమాలతో పాటూ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న నయన్, రీసెంట్ గా జవాన్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ సినిమా మంచి సక్సెస్ అవడంతో అక్కడి నుంచి కూడా నయన్ కు ఆఫర్లొస్తున్నాయి. మరి బాలీవుడ్ ఆఫర్లు కాబట్టి ఇప్పుడేమైనా స్ట్రాటజీ మారుస్తోందేమో చూడాలి.
నయన్ ఎలాగైతే చేస్తుందో ఇప్పుడు ఆ స్ట్రాటజీనే రష్మిక కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే టాలీవుడ్ ను పక్కకు పెట్టేయకుండా రష్మిక తెలివిగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. కమర్షియల్ సినిమాలతో పాటూ, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, ఇంకా కీలక పాత్రల్లో సైతం నటించడానికి రష్మిక సై అంటోంది. రీసెంట్‌గానే టాలీవుడ్ లో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకున్న రష్మికకు ఆ సినిమాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.













