Rashmika: లైఫ్ లో ఏదీ పర్మినెంట్ కాదు

లైఫ్ లో ఏదీ పర్మినెంట్ కాదంటుంది నేషనల్ క్రష్ రష్మిక(rashmika). ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ లో ఎలాంటి ప్రెజర్ ఉండదని కూడా రష్మిక చెప్తోంది. అమ్మడు నటించిన ఛావా(Chhava) బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వెంటనే వచ్చిన సికందర్(Sikandar) డిజాస్టర్ గా నిలవడంపై రష్మిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రతీ రోజూ ఒకేలా ఉండదని, ఏదీ పర్మినెంట్ కాదని తెలిపింది రష్మిక.
తాను ఎలాంటి సిట్యుయేషన్ లో ఉన్నా తన కుటుంబం, తన స్నేహితుల నుంచి మద్దతు ఉండటం తన లక్ అని, లైఫ్ లో ఏ సిట్యుషన్స్ ఎదురైనా వాటిని ఎదుర్కొనే టైమ్ లో వారు తనతోనే ఉన్నారని, ప్రతీ విషయంలో వారే తనకు సపోర్ట్ గా నిలిచారని రష్మిక వెల్లడించింది. తాను నటి అవాలనుకుని ఎప్పుడూ అనుకోలేదని, ఇండస్ట్రీలోకి రావాలని ప్లాన్ చేసుకోలేదని రష్మిక తెలిపింది.
కెరీర్లో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తానెంత అదృష్టవంతురాలినో అనే విషయం అర్థమైందని చెప్పిన రష్మిక, కెరీర్ విషయంలో స్థిరంగా ఉండి మనసుకి నచ్చిన వర్క్ చేయాలని, అదే తాను అందరికీ ఇచ్చే సూచన అని చెప్పింది. తాను ఇవాళ ఇలా ఉండటానికి కారణం తాను వచ్చిన ప్రతీ ఛాన్స్ ను వాడుకుంటూ ముందుకెళ్లడమేనని, లైఫ్ లో ఎప్పుడూ బెస్ట్ గా ఉండటానికి ట్రై చేయమని రష్మిక సూచించింది.