Rashi Khanna: చీరలో ఎంతో ముచ్చటగా రాశీ
ఊహలు గుసగుసలాడే(Oohalu Gusagusalade) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీ ఖన్నా (Rashi Khanna) తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని కుర్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉండే రాశీ తర్వాత్తర్వాత నేచురల్ గా వర్కవుట్స్ చేస్తూ బరువు తగ్గి నాజూగ్గా తయారైంది. ప్రస్తుతం రాశీ ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ పైనే ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే రాశీ తాజాగా ఓ క్యూట్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో రాశీ చీర కట్టుకుని, నుదుటిన పాపిటబిళ్ల, చేతికి గాజులు, సింపుల్ హెయిర్ స్టైల్ తో ఎంతో చూడముచ్చటగా కనిపించింది. రాశీని ఇలా చూసిన కుర్రాళ్లు తన ఫోటోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













