ఫిలింఫేర్ పురస్కారాల్లో మెరిసిన రంగస్థలం, మహానటి
ఇప్పటికే పలు పురస్కారాల్ని సొంతం చేసుకున్న రంగస్థలం, మహానటి చిత్రాలు మరోసారి మెరిశాయి. ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్ పురస్కారాల్లో ఇవి సత్తా చాటాయి. రంగస్థలం కు ఐదు, మహానటి కి నాలుగు పురస్కారాలు లభించాయి. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ -2019 వేడుక చెన్నైలో జరిగింది. రంగస్థలం కుగానూ రామ్చరణ్ ఉత్తమ నటుడిగా నిలిచారు. దేవిశ్రీప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, అనసూయ భరద్వాజ్ ఉత్తమ సహ నటిగా, చంద్రబోస్ ఉత్తమ గేయ రచయితగా, ఆర్.రత్నవేలు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా పురస్కారాలు దక్కించుకున్నారు. మహానటి ఉత్తమ చిత్రంగా, ఇందులో నటించిన కీర్తిసురేష్ ఉత్తమ నటిగా, దుల్కర్ సల్మాన్ విమర్శకులు మెచ్చిన ఉత్తమ నటుడిగా, దర్శకుడు నాగ్ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు.













