Ranbir: అభిమాని చేసిన పనికి షాకైన రణ్బీర్
రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) అందానికి ఆయనకెంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే ఆయనకు చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో ఓ క్రేజీ ఫ్యాన్ చేసిన ఫన్నీ సంఘటనను రణ్బీర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంటూ ఆలియా తన మొదటి భార్య కాదని అన్నాడు.
రణ్బీర్ ను ఎంతో ఇష్టపడే ఓ వీరాభిమాని తాను ఊళ్లో లేని టైమ్ లో పురోహితుడిని తీసుకొచ్చి తన ఇంటి గేట్ ను పెళ్లి చేసుకుందని, గేట్ కు పూలు, బొట్టు పెట్టి రణ్బీర్ తో నా పెళ్లి అయిపోయిందని వాచ్మెన్ తో చెప్పి మరీ వెళ్లిందట. ఇంటికొచ్చాక ఆ విషయం తెలుసుకుని తాను షాకయ్యానని చెప్తున్న రణ్బీర్ ఆమే నా మొదటి భార్య అని, కానీ ఇప్పటివరకు ఆమెను కలవలేదని, ఆమెను కలిసే రోజు కోసం వెయిట్ చేస్తున్నట్టు రణ్బీర్ తెలిపాడు.
అదే ఇంటర్వ్యూలో ఆలియా భట్(Alia Bhatt) గురించి కూడా రణ్బీర్ మాట్లాడాడు. ఆమె లాంటి గొప్ప భాగస్వామి దొరకడం తన అదృష్టమని చెప్పిన రణ్బీర్, ఆలియా ఒక వండర్ అని చెప్పాడు. అయితే ఆలియా కూడా సినిమాల్లోకి రాకముందు నుంచే రణ్బీర్ కు పెద్ద అభిమానే. వీరిద్దరూ రాక్ స్టార్(Rockstar) మూవీ ఈవెంట్ లో కలుసుకున్నారు. ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా, ప్రేమగా మారి తర్వాత పెళ్లి చేసుకున్నారనే విషయం తెలిసిందే.













