NTR Trivikram: ఎన్టీఆర్ కు విలన్ రానా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik roshan) తో కలిసి చేసిన బాలీవుడ్ మూవీ వార్2(war2)ను రిలీజ్ కు రెడీ చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో కలిసి తన తర్వాతి సినిమాను చేస్తున్నాడు. ఎన్టీఆర్‌నీల్(NTRNeel) సినిమా వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్‌నీల్ సినిమా తర్వాత తారక్(Tarak), త్రివిక్రమ్(Trivikram) తో ఓ సినిమా చేయనున్నట్టు నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. కేవలం అనౌన్స్‌మెంట్ తో ఆగకుండా ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి గురించి ఉంటుందని కూడా హింట్ ఇచ్చాడు. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ రీసెంట్ గా తారక్ కూడా ఎయిర్‌పోర్టులో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన బుక్ తో కనిపించాడు.
అయితే ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ రానా(Rana Daggubati) అయితే సరిగ్గా సరిపోతాడని అతన్ని తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విలన్ గా మంచి క్రేజ్ అందుకున్న రానా మరి ఈ ఆఫర్ కు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.