Kantha: డిటెక్టివ్ గా రానా

సినిమాల ఎంపిక విషయంలో కొత్తగా ఆలోచించే రానా(rana), దుల్కర్ సల్మాన్(dulquer salman) ఇద్దరూ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాంత(kantha). స్పిరిట్ మీడియా(spirit media), వేఫేరర్ ఫిల్మ్స్( Wayfarer films) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తోండగా, సముద్రఖని(samudrakhani) కీలక పాత్రలో నటిస్తున్నారు.
1950 మద్రాస్ నేపథ్యంలో పీరియాడిక్ జానర్ లో రాబోతున్న కాంత సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. లక్కీ భాస్కర్(lucky baskhar) సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. మల్టీ లింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న కాంత నుంచి త్వరలోనే టీజర్ రిలీజ్ కానున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో రానా పాత్రకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. కాంత మూవీలో రానా దగ్గుబాటి(rana daggubati) డిటెక్టివ్ గా కనిపించనున్నాడట. మరో హీరోగా దుల్కర్ కనిపించనున్నాడు. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేసి సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు మేకర్స్. కాంత సినిమా ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.