ఆ నమ్మకాన్ని తేజ నిలబెట్టుకుంటాడా?
ఏదైనా డైరెక్టర్ కు వరుసగా ఫ్లాపులు పడితే ఆ డైరెక్టర్లకు ఛాన్సులు రావడం కష్టం. ఒకప్పుడు తన ఖాతాలో ఎన్ని హిట్లున్నా, తన ట్రాక్ రికార్డు ఎలాంటిదైనా సరే ఇప్పుడు ఆయన రేంజ్ ఏంటన్నదే హీరోలు చూస్తారు. కానీ దీనికి తేజ మాత్రం అనర్హం. ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ రానా, తేజకు ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్గా దగ్గుబాటి అభిరామ్ ను పరిచయం చేస్తూ చేసిన అహింస సినిమా అనేది ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీలేదు.
బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సీత పరిస్థితి కూడా ఇంతే. అయినా సరే రానాకు మాత్రం తేజ మీద నమ్మకం తగ్గలేదు. రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన తేజపై రానాకు మంచి గురి కుదిరింది. తనలో పెర్ఫార్మర్ ను బయటకు తీసిన తేజకు అందుకే రానా మరోసారి ఆఫర్ ఇచ్చినట్లున్నాడు.
ఈ నేపథ్యంలోనే రానా, తేజ కాంబోలో తాజాగా రాక్షస రాజాని ప్రకటించారు. హీరోయిన్, టెక్నికల్ టీమ్ గురించి ఇంకా వివరాలు బయటకు రాలేదు కానీ ఈ సినిమాతో తేజ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంతో పాటూ, రానా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రానా కూడా తన కెరీర్‌పై దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది.













