Kantha: ‘కాంత’కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : రానా దగ్గుబాటి
దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ రెట్రో బ్లాక్ బస్టర్ ‘కాంత’ (Kantha). సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 14 విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. కాంత సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ గారి కెరీర్ ఫైనస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మ్యూజిక్, విజువల్స్ టెక్నికల్ వాల్యూస్ గురించి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ వున్నా సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. జోనర్ బెండింగ్ సినిమా గా వచ్చిన ఫస్ట్ ఫిలిమ్ కాంత . ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. మద్రాస్ నేపథ్యంలో జరిగే కథ కావడం, ఎలాంటి అంచనా లేకుండా చూడటంతో మద్రాస్ ఆడియన్స్ ఇంకా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు.
అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు రానా, భాగ్యశ్రీ సమాధానాలు ఇచ్చారు.
రానా గారు ఈ సినిమాని మీరు దుల్కర్ గారు నిర్మించడానికి కారణం ?
-నాకు కొలాబరేషన్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఆర్టిస్టులు రెండు కంపెనీలు ఒకచోట కలిసినప్పుడు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇండిపెండెంట్ ఆర్ట్ సినిమా నాకు దుల్కర్ గారికి ఇద్దరికి ఇష్టం. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది.
-చాలా గ్యాప్ తర్వాత నేను స్క్రీన్ మీద కనిపించాను. నా క్యారెక్టర్ కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది.
– దుల్కర్ అమేజింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బేసిగ్గా హీరో అంటే ఇన్ సెక్యూర్ అవ్వకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ దుల్కర్ ఆ ఎమోషన్ ని చాలా అద్భుతంగా ప్రదర్శించారు.
-భాగ్యశ్రీ క్యారెక్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తనకి బిగ్ కంగ్రాజులేషన్స్.
రానా గారు ఈ సినిమా సెట్స్ దానికోసం ఎలాంటి రీసెట్ చేశారు?
-చాలావరకు రిఫరెన్సులు వాహిని స్టూడియోస్ ఏవీఎం స్టూడియోస్ నుంచి చాలా వరకు రిఫరెన్స్ లు తీసుకున్నాం. ఆ టైంలో సెట్లు ఎలా చేసేవారు అనేది ప్రతిదీ డీటైలింగ్ గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ సెల్వ ప్రతి విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారు. డాని ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ ల చూపించాడు.
ఇది బయోపిక్ కాదు అన్నారు.. మరి ఎంజీఆర్, ఎంఆర్ రాజా లాంటి ప్రముఖ నటుల్ని ఎందుకు చూపించారు?
-ఇది ఆ టైం కి సంబంధించిన కథ. దానికి రిలవెంట్ గా ఉంటుందని అలా చూపించడం జరిగింది. 50, 60 దశకాల్లో నుంచి తీసుకున్న సినిమాల రిఫరెన్స్ లు ఇందులో చూపించడం జరిగింది.
భాగ్యశ్రీ గారు… ఇది మీ ఫస్ట్ తమిళ్ సినిమా కదా.. ఆ భాషలో పెర్ఫార్మ్ చేయడం ఎలా అనిపించింది?
-ముందుగా ఈ సినిమా అవకాశం రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అంత మంచి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా 100% ఇవ్వాలి. డైరెక్టర్ సెల్వ గారి సపోర్ట్ తో ప్రతి లైన్ ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను. ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. naa పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆరు నెలలు చెన్నైలోనే ఉన్నాను.
– ఈ సినిమా కోసం సావిత్రి గారు శ్రీదేవి గారు చేసిన చాలా సినిమాలు చూశాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. అందులోనూ పాత సినిమాలు ఇంకా ఇష్టం. అవన్నీ కూడా దీనికి ఉపయోగపడ్డాయి
– తమిళ్లో తెలుగులో రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి రెస్పాన్స్ ని నేను ఊహించలేదు.
రానా గారు ఇందులో మీ క్యారెక్టర్ కోసం ఏదైనా రిఫరెన్స్ ఉందా?
-లేదండి. డైరెక్టర్ సెల్వ కి ఒక పర్టికులర్ విజన్ ఉంది. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి? తను ముందే అనుకున్నాడు. నాకు అక్కడ ఉన్న ఏ పాత్ర మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు. ఈ అలాగే ఉండాలని తన ముందే ఫిక్స్ అయ్యాడు.
మీరు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకపోవడానికి కారణం? .
-నేను మొదటి నుంచి ఒక విభిన్నమైన దారిని ఎంచుకున్నాను.నేను చూడని సినిమా ఇవ్వాలనే ఉంటుంది. అది నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది.
భాగ్యశ్రీ గారు వరుసగా రెండు వారాల్లో మీరు వచ్చి రెండు సినిమాలు వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది?
-చాలా హ్యాపీ. కాంత రెస్పాన్స్ చాలా ఆనందం ఇచ్చింది. రెండు డిఫరెంట్ సినిమాలు. ఈ రెండిటి నేపథ్యం సినిమా అయినప్పటికీ కథపరంగా దేనికవి ప్రత్యేకమైన సినిమాలు.






