పవన్ కళ్యాణ్ పాత్రకి సరితూగేలా రానా కారెక్టర్! త్రివిక్రమ్ మ్యాజిక్ చూపిస్తాడట !
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొషియుం’ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించనున్నారు. ఈ రీమేక్‌కు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు మాటల మాంత్రికుడు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేతలకు త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడు. ఈ రెండు బ్యానర్లలో ఇప్పటికే త్రివిక్రమ్ చాలా సినిమాలు చేశారు. వీరిద్దరితో పాటు ‘అయ్యప్పనుమ్ కొషియుం’ రీమేక్‌కు త్రివిక్రమ్ పనిచేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ తనకి అత్యంత ఆప్త మిత్రుడు. ఏదేమైనా ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ తో రానా నటిస్తున్నాడు. ఒక పోలీస్ ఒక మిల్ట్రీ హవాల్దారుకు మధ్య రగిలిన ఇగోల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ రానా ఇద్దరూ ఓ రేంజిలో తలపడనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ అనేసరికి ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.
తాజాగా ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ గురించి ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. తమన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చూడవచ్చు. ఈ సినిమాలో త్రివిక్రమ్ ఇద్దరు స్టార్స్ ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇద్దరి పాత్రలను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. నిజానికి ఈ సినిమా విషయంలో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాదిస్తుందని అని చెప్పాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉండగా ఇప్పటికే అవన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్కో పాటను ఒక్కో రచయిత రాసారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మతో పాటు డైలాగ్స్ కూడా అందించాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.













