Ramyakrishna: నిజంగానే రాజమాతలా ఫీలయ్యా!

తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా సత్తా చాటిన రమ్యకృష్ణ(ramyakrishna) తనకంటూ సొంత ఐడెంటిటీని సొంతం చేసుకున్నారు. గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రమ్య, రాఘవేంద్ర రావు(raghavendra rao) దర్శకత్వంలో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు. బాహుబలి(baahubali) లో శివగామి(sivagaami)గా నటించి ఆ సినిమాతో నటిగా నెక్ట్స్ లెవెల్ కు వెళ్లారు రమ్య(ramya).
రీసెంట్ గా రమ్యకృష్ణ, జగపతి బాబు(jagapathi babu) హోస్ట్ చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా(jayammu nischayammura) కు హాజరై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో చేసిన ఐటెమ్ సాంగ్స్ అన్నీ మళ్లీ చేయాలనుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ, బాహుబలిలో శివగామిగా చేస్తున్నప్పుడు నిజంగానే తాను రాజమాతలా ఫీలైనట్టు చెప్పారు.
అయితే షో లో రమ్యకృష్ణను చిన్నప్పటి నుంచి నీకు చాలా మంది సైట్ కొట్టడం, నీ కోసం పడి దొర్లడం, వెంటపడటాలు చేసేవారట కదా అని జగపతి బాబు అడుగుతుండగానే నువ్వు కూడా అంటూ ఆయన ముఖం మీదే అనడంతో ఆయన ఏం మాట్లాడాలో తెలియక నవ్వుతూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఫుల్ ఎపిసోడ్ ఈ ఆదివారం జీ తెలుగులో మరియు జీ5లో అందుబాటులోకి రానుంది.