కరెక్ట్ డెసిషన్ తీసుకున్న రామ్
హ్యాట్రిక్ డిజాస్టర్లు రామ్ పోతినేని ఫ్యాన్స్ ను బాగా నిరాశ పరిచాయి. డబుల్ ఇస్మార్ట్ సినిమాతో తమ హీరో గట్టి కంబ్యాక్ ఇస్తాడనుకుంటే ఆ సినిమా ఇంకా గట్టి దెబ్బేసింది. వరుస సెలవులు, మంచి సీజన్, పోటీలో ఉన్న మిస్టర్ బచ్చన్ సినిమా ఫెయిల్యూర్ ఇన్ని అంశాలు కలిసొచ్చినప్పటికీ వాటిని వాడుకోలేకపోవడం చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది.
విపరీతమైన మాస్ సినిమాలు తీయాలని రామ్ అనుకోవడమే దీనికంతటికీ కారణం. అయితే ఈ పరిస్థితుల్లో రామ్ విషయంలో ఓ సానుకూలాంశం కనిపిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో ఉండగా రామ్ కొన్ని కథలు విన్నాడు. వాటిలో ఓ దర్శకుడికి రామ్ పాజిటివ్ గా కూడా స్పందించాడు. అందులో ఒకరు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా లాంచ్ అయింది కూడా. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ కు ఈ టైమ్ లో కావాల్సింది సెన్సిబుల్ కథలు, వాటిని సరిగా హ్యాండిల్ చేసే డైరెక్టర్లే. రామ్ ను రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో చూడాలని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఎమోషన్స్ ను మహేష్ బాబు ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో అందరూ చూశారు. కాబట్టి ఈసారి రామ్ తో కూడా మంచి ఎంటర్టైనర్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి రామ్ మంచి నిర్ణయమే తీసుకున్నాడనుకోవచ్చు.













