సేఫ్ గేమ్ ఆడుతున్న రామ్
రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ పోతినేనికి ఊహించని విధంగా షాక్ తగిలింది. ఆ సినిమా రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సినిమాలో రామ్ పాత్రకు తన వంతు న్యాయం చేసినప్పటికీ ఆడియన్స్ కు నచ్చేలా కథను చెప్పడంలో పూరీ విఫలమయ్యాడనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.
ఈ సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ నుంచి బయటికొచ్చిన రామ్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబుతో సినిమాకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ రామ్ తో సినిమా చేస్తానని చెప్పాడు.
త్వరలోనే రామ్ కు స్క్రిప్ట్ రెడీ చేసి నెరేట్ చేస్తానని హరీష్ చెప్పాడు. అయితే మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవడంతో ఇప్పుడు రామ్ ఈ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడు కమర్షియల్ డిజాస్టర్లు వచ్చాయి. ఇలాంటి టైమ్ లో మళ్లీ కమర్షియల్ సినిమా చేసి రిస్క్ చేయడమెందుకని మహేష్ బాబుతో సినిమా చేసి సేఫ్ గేమ్ ఆడాలని డిసైడ్ అయ్యాడట రామ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. వరుసగా మాస్ కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్లాప్స్ అందుకున్న రామ్ ఇక ముందు స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా ఉంటేనే కంప్లీట్ మాస్ జానర్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.













