Ram Pothineni: రామ్ క్రేజ్ మామూలుగా లేదుగా!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) కు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. తన లుక్స్, డైనమిక్ యాక్టింగ్ తో ఫాలోవర్లను పెంచుకుంటూ వెళ్తున్న రామ్ కు లేడీస్ లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అంతెందుకు ఈ మధ్య కాలంలో ఇద్దరు టాలీవుడ్ భామలు రామ్ పై తమ అభిమానాన్ని మీడియా ముఖంగా బహిరంగంగా తెలియచేశారు.
బేబీ(Baby) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య(Vyshnavi Chaitanya) రామ్ కు తను పెద్ద ఫ్యాన్ అని అభిమానాన్ని వ్యక్తం చేసింది. ఇక తాజాగా యువ నటి శ్రీ సత్య(Sri Satya) కూడా రామ్ పై తన అభిమానాన్ని తెలుపుతూ, తన సినీ జీవితం మొదలవడానికి, చదువు మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి రావడానికి కారణం రామ్ పోతినేనినే అని చెప్పింది.
రామ్ కు అమ్మాయిలు త్వరగా కనెక్ట్ అవడానికి కారణం ఆయన నటన, వ్యక్తిత్వంతో పాటూ ఆయనకు ఫ్యాన్స్ తో ఉండే ప్రత్యేక బంధమే. ఇక కెరీర్ పరంగా చెప్పుకుంటే రామ్ ప్రస్తుతం తన 22(Rapo22)వ సినిమాను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) డైరెక్టర్ మహేష్ బాబు(Mahesh Babu)తో చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తుంది.













