Ram Pothineni: రామ్ చరణ్ బాటలోనే రామ్ కూడా
హీరోల ట్యాగ్స్ వారి కెరీర్ కు అనుగుణంగా మారుతూ ఉంటాయనే సంగతి తెలిసిందే. కెరీర్ ఎలాంటి ట్యాగులు లేకుండా స్టార్ట్ అయితే ఆ తర్వాత సక్సెస్ వచ్చేకొద్దీ దానికి తగ్గట్టు హీరోలకు ట్యాగ్స్ వస్తుంటాయి. అలా ఒక్కో హీరోకీ ఒక్కో ట్యాగ్ ఉంటుంది. అయితే సక్సెస్, క్రేజ్, మార్కెట్ స్థాయి పెరిగే కొద్దీ హీరోలు కూడా తమ ట్యాగులను మార్చుకుంటూ వస్తారు.
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రామ్ చరణ్(Ram charan) స్థాయి ప్రపంచ వ్యాప్తంగా పెరగడంతో అప్పటి వరకు ఉన్న మెగా పవర్ స్టార్(mega power star) ట్యాగ్ ను తీసేసి గ్లోబల్ స్టార్(Global star) అని కొత్తగా పెట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన ఆచార్య(Acharya), గేమ్ ఛేంజర్(game changer) సినిమాలకు చరణ్ పేరు ముందు ఈ కొత్త ట్యాగే ఉంది. కానీ ఆ రెండు సినిమాలూ డిజాస్టర్లవడంతో ఆ ట్యాగ్ పై విమర్శలొచ్చాయి. దీంతో తర్వాతి సినిమా పెద్ది(Peddi) కోసం తన పాత ట్యాగ్ అయిన మెగా పవర్ స్టార్ నే చరణ్ పెట్టుకుంటున్నాడు.
చరణ్(Charan) ను ఫాలో అవుతూ మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాడు. అతనే రామ్ పోతినేని(Ram Pothieni). ఎనర్జిటిక్ స్టార్(Energetic star) రామ్ గా ఎంతో పాపులరైన రామ్, ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) సక్సెస్ తర్వాత మాస్ లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందని, ఇకపై తన ట్యాగ్ కూడా దానికి తగ్గట్టే ఉండాలని ఉస్తాద్ గా మార్చుకున్నాడు. ఉస్తాద్(Ustaad) గా మార్చుకున్న తర్వాత రామ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా నమోదవలేదు. దీంతో ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra king Thaluka) కోసం రామ్ కూడా తన పాత ట్యాగ్ అయిన ఎనర్జిటిక్ స్టార్ నే పెట్టుకుంటున్నాడు. మరి ఈ సినిమానైనా రామ్ కు సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.







