చరణ దంపతులకు రామ మందిర ఆహ్వానం
అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది. గుడి ఓపెనింగ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ఎక్కడా ఎలాంటి లోపాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఉండేట్లు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్‌వుడ్ కు చెందిన సెలబ్రిటీలందరికీ ఆహ్వానం ఇప్పటికే అందిన విషయం తెలిసిందే. అన్ని పరిశ్రమల స్టార్ నటులకు ఇప్పటికే గవర్నమెంట్ నుంచి ఇన్విటేషన్ వెళ్లింది. టాలీవుడ్ నుంచి చిరంజీవికి, ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది.
ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ దంపతులకు కూడా అయోధ్య రామమందిర ఆహ్వానం అందింది. స్వయంగా రామ మందిర ట్రస్ట్ ప్రతినిధులు ఈ జోడీని ఆహ్వానించారు. దీంతో మెగా కుటుంబమంతా ఈ కార్యక్రామానికి హాజరు కానున్నారు. కోలీవుడ్ నుంచి రజినీకాంత్, ధనుష్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండిల్‌వుడ్ నుంచి యష్, రిషబ్ శెట్టి, బాలీవుడ్ నుంచి అమితాబ్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్,రణ్‌బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, రాజకుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీకి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.













