Andhra King Thaluka: టాలీవుడ్ హీరోల్లో మొదటి సారి రామ్ కే ఈ భాగ్యం
యాక్టింగ్, అందం, టాలెంట్ అన్నీ ఉన్నా ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత కొన్ని సినిమాలుగా సక్సెస్ లో లేడు. రామ్ ఆఖరిగా హిట్ కొట్టింది ఇస్మార్ట్ శంకర్(ismart shankar) సినిమాతో. 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చాలా సినిమాలు చేశాడు కానీ అవన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లుగానే మిగిలాయి.
దీంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఎంతో కసిగా ఉన్న రామ్ తన తర్వాతి సినిమాను పి. మహేష్ బాబు(mahesh babu) దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆంధ్రా కింగ్ తాలుకా(andhra king thaluka) టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra) కీలక పాత్రలో పోషించారు.
ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఆల్రెడీ మేకర్స్ మంచి సాంగ్స్ తో ట్రీట్ ఇవ్వగా, నవంబర్ 18న కర్నూల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. నవంబర్ 18 సాయంత్రం 5 గంటల నుంచి స్పెషల్ డ్రోన్ షో ను చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మన తెలుగు హీరోల్లో ఓ హీరోకి ప్రమోషనల్ ఈవెంట్ లో ఇలా డ్రోన్ షో చేయడం ఇదే మొదటి సారి. కాబట్టి ఈ సినిమా రామ్ ఫ్యాన్స్ కు మరింత స్పెషల్ గా మారుతుందని చెప్పొచ్చు.






