చంద్రబాబు అన్న మాటలు నిజమే
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏమాత్రం వక్రీకరించకుండా తీస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై చంద్రబాబు అన్న మాటలు ముమ్మాటికీ నిజమేనని అన్నారు. అందుకే తాను నిజంగా జరిగిన సంఘటనలనే ఏమాత్రం వక్రీకరించకుండా తెరకెక్కించబోతున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు అన్నట్లు నిజంగా ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమేనని పేర్కొన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి వైకాపా నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై ఎవరు ఎలాంటి కామెంట్లు చేసిన వర్మ సోషల్ మీడియలో వారికి దీటుగా సమాధానమిస్తున్నారు.













