ఆర్జీవీ ‘ప్రపంచంలో’కి మరో అందాల భామ…
రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ కొత్త కొత్త వివాదాలతో మన ముందుకు వస్తుంటాడు. అంతేకాదు కొత్త కొత్త అందాలనూ ప్రపంచానికి పరిచయం చేస్తుంటాడు. ఆయన కాంట్రావర్సిలెంత ఫ్రెష్‌గా ఉంటాయో ఆయన సినిమాల్లో చేసే హీరోయిన్లూ అంతే ఫ్రెష్‌గా మన ఇండియన్ స్క్రీన్‌పై మెరుస్తుంటారు. గత కొంత కాలంగా చేసిన హీరోయిన్‌తో చేయకుండా వరుసపెట్టి సినిమా సినిమాకీ హీరోయిన్ని మారుస్తూ వస్తున్న వర్మ… తన తదుపరి సినిమా కోసం మరో కొత్త భామను తెరకెక్కిస్తున్నాడు.
తాజా వర్మ షూట్ చేయనున్న ఆ అందం పేరు అప్సరా రాణి. లుక్స్ చూస్తుంటే సార్ధక నామధేయురాలిలా ఉన్న అప్సర… అందాలు ఆరబోయడంలో బాగా ‘రాణించేలాగే ఉందని ఆమె ఫొటోలు చూసిన వారు అంటున్నారు. ఒడిశాకు చెందిన అప్సర పెరిగింది పర్వత శ్రేణులకు ప్రసిద్ధి చెందిన డెహ్రాడూన్‌లో నట. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్న ఈ సుందరికి డ్యాన్సులు కూడా అదరగొట్టేస్తుందంటున్నారు. ఆర్జీవీ వరల్డ్ ధియేటర్ బ్యానర్ కింద క్లయిమాక్స్, నేక్డ్ వంటి సినిమాలను రూపొందించి చూసినవాళ్లతో విమర్శలతో పాటు దండిగా డబ్బులు కూడా సంపాదించిన వర్మ అప్సర రాణితో తీయబోయే సినిమా పేరు థ్రిల్లర్.













