రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి?
ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. తనవరకు రాజధాని పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా పట్టించుకోనని సృష్టం చేశారు. రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి? అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు వర్మ. ప్రజలకు నేరుగా పాలన అందించడం కోసమే రాజధాని అనుకుంటే, ప్రతి నగరంలో ఓ రాజధాని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. విశాఖలో జరిగిన బ్యూటి పుల్ చిత్ర ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడుతూ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.













