థమన్‌కు ఎలివేషన్లు ఇస్తున్న రామ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందు ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నారు మేక్స్.
ఇదిలా ఉంటే స్కంద సాంగ్స్ పై ఫస్ట్ నుంచి చిత్ర యూనిట్ మంచి హైప్ క్రియేట్ చేస్తూ వచ్చింది. కానీ తీరా స్కంద పాటలు మార్కెట్ లోకి వచ్చాక చెప్పినంతగా లేకపోవడం పక్కనపెడితే థమన్ చాలా చప్పటి ట్యూన్స్ ఇచ్చాడంటూ పెదవి విరిచారు. సరిగ్గా ఇదే టైమ్ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి రామ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.
స్కంద ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ థమన్ రీరికార్డింగ్ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. అఖండ సినిమాకు థమన్ ఇచ్చిన బీజీఎం ఏ రేంజ్లో గుర్తు పెట్టుకున్నారో స్కంద బీజీఎం కూడా అదే రేంజ్లో ఉంటుందని, థమన్ రీరికార్డింగ్ కు స్పీకర్స్ బద్దలవడం ఖాయమని చెప్పుకొచ్చాడు. గత కొన్ని సినిమాలుగా థమన్ మంచి పాటలే కాదు, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇవ్వట్లేదని వస్తున్న వార్తలకు థమన్ స్కంద సినిమాతో సమాధానం చెప్తాడేమో చూడాలి.













