పూరీపై రామ్ డబుల్ నమ్మకం
మరి కొన్ని గంటల్లోనే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. లైగర్ ఇచ్చిన ఫలితాన్ని మైండ్ లో పెట్టుకుని ఈ సినిమాను ఎంతో కసిగా తీసినట్లు డైరెక్టర్ పూరీ జగన్నాధ్ చెప్పాడు. రామ్ ఎనర్జీని వాడుకుని ఈసారి కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ కొడతానని పూరీ ఎంతో కాన్ఫిడెంట్ గా అంటున్నాడు. ఛార్మీ కూడా ఇంతకు ముందులా కాకుండా ఈ సినిమా సక్సెస్ అయ్యాకే మాట్లాడతానని చెప్పింది.
ఈ సినిమాకు బజ్ చాలా బాగుంది. పోటీ పరంగా ఈ సినిమాకు ఎన్నో సవాళ్లున్నాయి. అదే రోజు రిలీజ్ కానున్న రవితేజ మిస్టర్ బచ్చన్ ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లు వేస్తున్నారు. టాక్ బాగుంటే మాత్రం ఆ ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ మీద పడే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఆయ్ మూవీని సీరియస్ గా తీసుకోవాల్సిన పన్లేదు అనుకున్నప్పటికీ బన్నీ వాస్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో మ్యాటర్ ఉన్నట్లే అనిపిస్తోంది.
తంగలాన్ రిలీజ్ అవుతున్నా సరే దానికి బజ్ లేదనే విషయం అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎన్ని సినిమాలు పోటీకి ఉన్నా సరే డైరెక్టర్ పూరీ, హీరో రామ్ నమ్మకం మాత్రం ఒక్కటే. డబుల్ ఇస్మార్ట్ లో ఉన్నంత మాస్ కంటెంట్ ఆ రోజు రిలీజవుతున్న ఏ సినిమాలోనూ లేదని. తమ సినిమాలో ఎన్నో యాక్షన్ సీన్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తాయని, రామ్ వేసే డ్యాన్స్ స్టెప్పులకు ఫ్యాన్స్ సీట్లలో కూర్చోరని ఎంతో నమ్మకంగా ఉన్నారు. వాళ్ల నమ్మకం నిజమై డబుల్ ఇస్మార్ట్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాలీవుడ్ లో కూడా మంచి కలెక్షన్స్ సాధించొచ్చు.













