Champion: ‘ఛాంపియన్’ కంటెంట్ చూస్తుంటే క్లాసిక్ లా అనిపిస్తుంది : రామ్ చరణ్
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. అందరికీ వెల్కమ్. నన్ను ఈ వేడుకకు ఇన్వైట్ చేసిన టీమ్ అందరికీ థాంక్యూ. కో ఇన్సిడెంట్ గా నేను పక్క స్టూడియోలోనే షూటింగ్ చేస్తున్నాను. ఎన్టీఆర్ కి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్, అల్లు అర్జున్ కి మొదటి సినిమా గంగోత్రి, మహేష్ గారికి రాజకుమారుడు, నాకు చిరుత.. మా అందరికీ మోస్ట్ కామన్ బ్యూటిఫుల్ పర్సన్ మా దత్తు గారికి, వైజయంతి మూవీస్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేము ఎలా పెర్ఫాం చేస్తామో తెలియకుండానే మా అందరికీ మొదటి సినిమా ఇచ్చి ఇంత అద్భుతమైన ప్రయాణాన్ని ఇచ్చినందుకు దత్తుగారికి థాంక్యూ సో మచ్. రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్ తో వస్తున్నాడు. తనకి వైజయంతి మూవీస్ లో అద్భుతమైన సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. వైజయంతి పేరు ఉంటే చాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు వస్తాయి, రోషన్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఇందులో తన పోస్టర్ చూస్తుంటే ఒక హాలీవుడ్ యూరోపియన్ యాక్షన్ హీరో లాగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. చాలా మంచి మనసున్న మా అన్నయ్య శ్రీకాంత్, ఊహగారు. రోషన్ కి వాళ్ళ అందమే వచ్చింది. నా రెండో సినిమా మగధీర ఎంత పెద్ద హిట్ అయిందో ఛాంపియన్ అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పెర్ఫార్మ్ చేయాలంటే చాలా మెచ్యూరిటీ కావాలి.
ఈ సినిమా కోసం రెండేళ్లు అలాంటి ప్రీ ప్రొడక్షన్ జరిగింది. మేము కూడా కొన్ని సినిమాలు కి మూడు నాలుగు సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద ఉన్నాం. సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందనేది ముఖ్యం. అశ్విని దత్ గారు ఎంత పాషన్ గా ఉంటారో స్వప్న ప్రియాంక కూడా అంతే పాషన్ తో వర్క్ చేస్తారు. అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికినప్పుడు ప్రతి నటుడు డైరెక్టర్ చాలా లక్కీ. వాళ్ళు చాలా మంచి డైరెక్టర్స్ ని యాక్టర్స్ ని పరిచయం చేశారు. అలాగే నాగ్ అశ్విన్ గారితో ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. స్వప్న ప్రియాంక మళ్లీ నాకు అవకాశం ఇస్తే వాళ్ళ బ్యానర్లో చేయాలని అనుకుంటున్నాను.నా స్వార్థం ఏంటంటే ఇంత పాషన్ ఉన్న మనుషులతో పని చేస్తే మనం హాయిగా షూటింగ్ కి వెళ్లి రావచ్చు. ప్రదీప్ గారు తన షార్ట్ ఫిలిం తో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఇందులో చూపించిన విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కంటెంట్ చూస్తుంటే ఒక క్లాసిక్ లాగా అనిపిస్తుంది. ఒక లగాన్ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. రోషన్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ప్రదీప్ గారు తన యాక్టర్స్ ని చాలా చక్కగా మౌల్డ్ చేశారు. ఈ సినిమా కోసం టీమ్ అందరు పెట్టిన హార్డ్ వర్క్ డిసెంబర్ 25న రిజల్ట్ ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నాను.
తోట గారు, పీటర్ మాస్టర్, మిక్కీ జే మేయర్ ఇలాంటి లెజెండ్స్ ఈ సినిమాకి పనిచేశారు. చాలా రేర్ గా ఇలాంటి కాంబినేషన్స్ వస్తాయి. కచ్చితంగా చెప్తున్నాను ఛాంపియన్ విన్నర్ అవుతుంది. అనస్వర ఫేస్ చాలా కళగా ఉంది. తన పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. తనకి తప్పకుండా చాలా మంచి అవకాశాలు వస్తాయి. తన మాతృభాష మలయాళం కానీ మన తెలుగు భాష నేర్చుకుని ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పింది. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా అలా చెప్పలేదు. మా నాన్నగారితో మున్నాభాయ్ ఎంబిబిఎస్ మున్నాభాయ్ జిందాబాద్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ జెమినీ కిరణ్ గారు కూడా ఈ సినిమాకి సహానిర్మాతలుగా ఉన్నారు. వారికి ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 25న ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశగా ఉంది. మీరందరూ కూడా చూసి టీమ్ హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్. కల్కి చివర్లో ఉన్నప్పుడు ఈ సినిమా మొదలైంది. ఈ సినిమా బిగినింగ్ నుంచి జర్నీ తెలుసు. వైజయంతి ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలుసు. ఈ సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. ప్రదీప్ గారు చాలా ముఖ్యమైన కథ చెబుతున్నారు. రోషన్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. అనస్వర ఈ సినిమా తర్వాత చాలామందికి ఫేవరెట్ అవుతుంది. బైరాన్ పల్లి వీరులందరి పెర్ఫార్మన్స్ మీ అందరికీ నచ్చుతుంది. అందరు కూడా ఈ సినిమా గురించి మాట్లాడతారు. గిరగిర సాంగ్ ట్రెండ్ అవుతుంది ఛాంపియన్ మన నేల కథ. బైరన్ పల్లి విలేజ్ లో ఏం జరిగిందనేది చాలామందికి తెలీదు.అలాంటి కథ చెప్పాలనే పాషన్ తోనే వైజయంతి మూవీస్ ఈ సినిమా చేస్తోంది. తప్పకుండా డిసెంబర్ 25న మీరందరూ ఎంజాయ్ చేస్తారు.
హీరో రోషన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ మూడేళ్లలో నేను చాలా నేర్చుకున్నాను. ఇక ఆగేది లేదు. ప్రదీప్ గారు ఆల్రెడీ నేషనల్ అవార్డు గెలిచారు. నాకు మైకేల్ క్యారెక్టర్, ఛాంపియన్ సినిమా ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన చేసిన హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కి నిజంగా హ్యాట్సప్. ఆయన కూడా నాలుగేళ్ల పాటు ఈ సినిమా పైనే ఉన్నారు. ప్రదీప్ గారి విజన్ ని మది గారు మరో మెట్టెక్కించారు తోట గారి సెట్ కి వెళ్ళినప్పుడు నిజంగా 1940 కి వెళ్ళిపోయామా అనిపించింది. స్వప్న గారు ఈ ప్రాజెక్టు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు స్వప్న గారికి థాంక్యూ. మిక్కీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గిరగిరా సాంగ్ జన జనాల్లోకి ఎంత అద్భుతంగా వెళ్ళిందో అందరికీ తెలుసు. అనస్వర చాలా అద్భుతమైన నటి. చాలా ఎమోషన్లు ఉన్న క్యారెక్టర్ని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. వైజయంతి మూవీస్ టీం కి థాంక్యూ. స్వప్న, ప్రియాంక అక్క నాగీ అన్న దత్ గారు వీళ్ళందరూ నాకు ఫ్యామిలీతో సమానం.
మమ్మల్ని ఎంతో కంఫర్టబుల్‌గా చూసుకున్నారు. షూటింగ్ అంతా చాలా హ్యాపీగా గడిచింది. ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నీషియన్ అందరూ 100% ఎఫర్ట్ పెట్టారు. మా నాన్న ద్వారా నాకు చాలా మంది పరిచయమయ్యారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న. చరణ్ అన్న ని ఎప్పుడు కలిసినా ఆయన చూపించే ప్రేమ ఆప్యాయత నన్ను ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన రావడంతో మా అందరిలో ఒక కొత్త జోష్ వచ్చింది. నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ థాంక్యు. ఇది మైఖేల్ గాడి కథ, ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర. బైరాన్ పల్లి చరిత్ర. బైరాన్ పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర. అలాంటి కథను తీసుకొచ్చిన ప్రదీప్ గారికి థాంక్యూ సో మచ్. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ సినిమాని థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన రామ్ చరణ్ గారికి థాంక్యూ. నా లైఫ్ లోకి వచ్చిన ఏంజిల్స్ స్వప్న గారు రోషన్. సప్న గారి సంకల్పం రోషన్ నమ్మకంతోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమా హిట్ కాబోతుంది. ఇందులో 90% క్రెడిట్ వారిదే. స్వప్న గారికి మంచి సినిమాలు చేయాలనే సంకల్పం. డైరెక్టర్ డ్రీమ్ ప్రొడ్యూసర్ స్వప్న. కథ చెప్పినప్పుడే ఆ సినిమాకి ఏం కావాలో పూర్తిగా అర్థమవుతుంది. అందుకే ఈ సినిమాకి లెజెండ్రీ ఆర్ డైరెక్టర్ తోటగారు, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ, డిఓపి మది, పీటర్ మాస్టర్ ఇలా ఎంతో పెద్ద టెక్నీషియన్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. రోషన్ ని చూడగానే ఈ సినిమాకి హీరో క్యారెక్టర్ దొరికేసింది అనిపించింది. తను ఈ సినిమా పూర్తి చేసిన తర్వాతనే మరో సినిమా చేస్తానని చెప్పాడు. తన కెరీర్లో 1000 రోజులు నాకు ఇచ్చాడు. అందరికీ థాంక్యూ.
ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ.. అందరికీ వందనాలు. నేను ఇంట్రడ్యూస్ చేసిన చరణ్ ఈరోజు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఆయన సినిమా పెద్ది వస్తుందంటే ఈరోజు నుంచే చూడాలి అనిపించేంత కోరిక ఉంది. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న రోషన్ కూడా వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్
శ్రీకాంత్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. రోషన్ ని బ్లెస్ చేయడానికి వచ్చిన రామ్ చరణ్ కి థాంక్యూ. ఈ సినిమా కోసం మీ అందరి లాగానే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ప్రదీప్ అద్భుతమైన దర్శకుడు. తన భవిష్యత్తులో చాలా పెద్ద దర్శకుడు అవుతాడు. మా దత్తు గారితో పెళ్లి సందడి చేశా. ఇప్పుడు రోషన్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను రామ్ చరణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన మగధీర సినిమా ఎన్నోసార్లు చూశాను. ఆయన మా ట్రైలర్ ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో తెలుగులో లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.






