Ram Charan: గ్యాప్ లేకుండానే సుక్కుతోనే!

ఆర్ఆర్ఆర్(RRR) తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆ తర్వాత వెంటనే స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో సినిమాను మొదలుపెట్టడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. కానీ గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా అనుకున్న విధంగా వెంటనే పూర్తవలేదు. షూటింగ్ లో జాప్యం, తర్వాత పలు వాయిదాల తర్వాత ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైంది.
ఎంతో కష్టపడి చేసిన గేమ్ ఛేంజర్ పై అటు చరణ్, ఇటు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా, ఆ సినిమాపై వారి ఆశలను నిరాశగా మిగిల్చింది. దీంతో చేసేదేమీ లేక చరణ్ తన తర్వాతి సినిమాపై ఫోకస్ చేశాడు. అందులో భాగంగానే ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchibabu sana) దర్శకత్వంలో పెద్ది(Peddi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్.
వచ్చే ఏడాది మార్చిలో పెద్ది సినిమా రిలీజ్ కానుండగా, జనవరి నెలాఖరు వరకు చరణ్ పెద్ది సినిమాకే తన డేట్స్ ను కేటాయించాడు. ఆ సినిమా పూర్తవగానే సుకుమార్(Sukumar) దర్శకత్వంలో మూవీ చేయనున్న రామ్ చరణ్, దాన్ని గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఫిబ్రవరిలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశాడట. గతంలో సుక్కు, చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం(rangasthalam) భారీ హిట్ అయిన నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో రానున్న సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది.