చరణ్ తో వెట్రిమారన్ మూవీ?
సౌత్ సినీ ఇండస్ట్రీలో కల్ట్ అండ్ రా కంటెంట్ తో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ గా వెట్రిమారన్ కు చాలా మంచి పేరుంది. నిజ జీవిత సంఘటనలని, సమాజంలో బడుగు బలహీన వర్గాల సంఘర్షణని వెట్రిమారన్ తన సినిమాల ద్వారా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన సినిమాలకు అంత ప్రత్యేకత. అలాంటి వెట్రిమారన్ చాలా కాలం నుంచి తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని చూస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్టీఆర్ కు ఓ కథ కూడా వినిపించాడు. స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ ఎందుకో తారక్, వెట్రిమారన్ కాంబో సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం తమిళంలో విడుతలై 2 చేస్తున్న వెట్రిమారన్ రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిసినట్లు తెలుస్తుంది. ఇద్దరూ ఓ స్క్రిప్ట్ పైన డిస్కస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వెట్రిమారన్ చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందని టాక్ వినిపిస్తుంది.
కానీ ఈ విషయంలో చరణ్ నుంచి కానీ, వెట్రిమారన్ టీమ్ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ వీరి కలయికలో సినిమా వస్తే అది కచ్ఛితంగా గొప్ప సినిమా అయ్యే ఛాన్సుంది. ప్రస్తుతం శంకర్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్న రామ్ చరణ్, ఆ తర్వాత బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు. అది పూర్తవగానే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు చరణ్. మరి ఆ తర్వాతేమైనా వెట్రిమారన్ తో చరణ్ సినిమా ఉంటుందేమో చూడాలి.













