దసరా టార్గెట్ గా గేమ్ ఛేంజర్
రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఓ వైపు ఇండియన్2 పనులను చూసుకుంటూనే శంకర్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గేమ్ ఛేంజర్ ను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది రిలీజ్ చేయాలని దిల్ రాజు చాలా పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ ఫస్ట్ కాపీ ఎప్పుడు రెడీ అవుతుందనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. గేమ్ ఛేంజర్ ను మొదట్లో వినాయక చవితికి రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ను దసరాకు షిఫ్ట్ చేయాలని చూస్తున్నాడట దిల్ రాజు. దీని వెనుక పెద్ద ప్లానే ఉంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి. ఆ తర్వాత రోజు బతుకమ్మ పండగ.
తర్వాత 4, 5, 6 లాంగ్ వీకెండ్. తిరిగి 11 దుర్గాష్టమి, 12న దసరా, 13న ఆదివారం మొత్తం సెలవులే. సినిమాకు మంచి టాక్ వస్తే కలెక్షన్లకు తిరుగుండదు. వరుసగా 10 రోజులు సెలవులంటే మంచి టాక్ వచ్చినప్పుడు నిర్మాతలకు లాభాల పంట ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే ఈ డేట్ ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదని చూస్తున్నాడట దిల్ రాజు. దానికి తోడు ఆ టైమ్ లో ఏ ఇతర సినిమా రిలీజ్ ను లాక్ చేసుకోలేదు కాబట్టి ఇదే మంచి టైమ్ అనుకుంటున్నాడట. మరి శంకర్ మనసులో ఏముందో చూడాలి.













