Salman Khan: సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు హాజరైన రామ్ చరణ్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. స్టార్లతో నిండిన ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరుకావడం ఈవెంట్ ని మరింత స్పెషల్ గా మార్చింది.

రామ్ చరణ్ సింపుల్, క్లాసీ లుక్‌లో అదరగొట్టారు. సాఫ్ట్ కలర్స్‌తో కూడిన క్లిన్ అవుట్‌ఫిట్‌లో నేచురల్ స్టైల్‌తో అలరించారు. ఆయన స్టైల్, స్వాగ్ హైలైట్‌గా నిలిచాయి. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోనీ, బాబీ డియోల్ కలిసి దిగిన ఫోటో. సినిమా, క్రికెట్ ప్రపంచాలకు చెందిన దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో సహజంగా నవ్వుతూ కనిపించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ – సల్మాన్ ఖాన్ల మధ్య ఉన్న స్నేహబంధం ఈ వేడుకలో స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం వృత్తిపరమైన పరిచయమే కాదు, అంతకంటే లోతైన అనుబంధమని ఈ మూమెంట్స్ చాటి చెప్పాయి. మెగా ఫ్యామిలీతో సల్మాన్‌కు ఉన్న సన్నిహిత సంబంధం, చరణ్ ప్రజెన్స్ ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చింది. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.






