యూఎస్ ఆడియన్స్ కు స్కంద పై నో ఇంట్రెస్ట్
సక్సెస్ రేట్ ఎక్కువ అయినప్పటికీ బోయపాటి శ్రీను కి యూఎస్ లో పెద్దగా మార్కెట్ లేదన్నది మాత్రం వాస్తవం. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి డైరెక్టర్ల నుంచి వచ్చిన సినిమాలంటే హీరో ఎవరైనా సరే పట్టించుకోకుండా మినిమం ఓపెనింగ్స్ ఇచ్చే జనాలు, బోయపాటి విషయానికొచ్చే సరికి అసలు డిమాండ్ లేని వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. బోయపాటికి యూఎస్ లో మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం కూడా కష్టమనే చెప్పాలి. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చే సినిమాలకు సైతం అక్కడ పెద్దగా డిమాండ్ కనిపించలేదంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ దాటుకుని అఖండ సినిమా ఓవర్సీస్ లో బాగానే కలెక్ట్ చేసినప్పటికీ బోయపాటి నుంచి వస్తున్న కొత్త సినిమా స్కంద కు మాత్రం ఇప్పుడు యూఎస్ లో పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు.
ఈ మూవీ ట్రైలర్ చూశాక ఉన్న అంచనాలను కూడా యూఎస్ ఆడియన్స్ వదులుకున్నట్లు కనిపిస్తుంది. స్కందకు గతంలో మంచి రేట్ వచ్చినప్పటికీ నిర్మాత ఒక పర్టిక్యులర్ రేటును డిమాండ్ చేస్తూ ఆ రేట్ కోసం వెయిట్ చేశాట. ఇప్పుడు ట్రైలర్ చూశాక బయ్యర్లు ముందు చెప్పిన రేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. రిలీజ్ కు మరో రెండు వారాలే ఉన్నప్పటికీ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ పూర్తి కాలేదంటే ఈ సినిమాకు అక్కడ క్రేజ్ ఏ మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మంచి రేటుకు అమ్ముకున్న నిర్మాత, ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ అమ్మడం కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ డీల్ ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.













