Rakul Preeth Singh: అందం పైకి కనిపించేది కాదు
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet’s Singh) ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న రకుల్, రీసెంట్ గా మేరే హస్బెండ్ కీ బీవీ(Mere Husband ku Beewi) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదిలా ఉంటే రకుల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రస్తుతం డ్రీమ్ లైఫ్ ను గడుపుతున్నట్టు చెప్పుకొచ్చింది.
రకుల్ చిన్నప్పటి నుంచే వెండితెరపై కనిపించాలని ఎన్నో కలలు కనేదట. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డానని, ఎన్నో త్యాగాలు చేశానని, తాను పడిన కష్టానికి, చేసిన త్యాగాని ప్రస్తుతం తాను డ్రీమ్ లైఫ్ ను అనుభవిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రకుల్ అందం గురించి కూడా మాట్లాడి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అందం అనేది బయటకు కనిపించేది కాదని, అందం లోపల దాగి ఉంటుందని, అందం మన నవ్వులో, కళ్లలో కనిపించాలని అలా కనిపిస్తే ప్రతీ ఒక్కరూ అందంగానే కనిపిస్తారని రకుల్ చెప్తోంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ వర్క్ లో తానెంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటానని చెప్తుంది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం(Ramayan)లో కూడా రకుల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.













