నాగార్జున సరసన రకుల్ సై
రకుల్ ప్రీత్‌సింగ్‌కు మొన్న వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు లో తప్ప తెలుగు సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు. ఇటీవల నాగచైతన్య చేస్తోన్న వెంకీ మామ లో కథానాయికగా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మరో మెగా చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. నాగార్జున సరసన నటించేందుకు సై అందింది. ఆయన హీరోగా మన్మధుడు కు సీక్వెల్‌గా మన్మథుడు 2 రాబోతుంది. రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు. ఇందులో రకుల్ మెయిన్ హీరోయిన్గా చేస్తుంది. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్లో ఈ అమ్మడు జాయిన్ కానుంది. మార్చి మూడో వారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది.













