KS Gopali: రజినీ గురువు ఇక లేరు
సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth), బిగ్ బి అమితాబ్ బచ్చన్(amithab bachan), మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) లాంటి స్టార్ హీరోలకు నటనలో మెలకువలు నేర్పిన కెఎస్ నారాయణ స్వామి(KS Narayana swamy) తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నారాయణ స్వామి 92 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నారాయణ స్వామి ఎంతో మందికి నటనలో ట్రైనింగ్ ఇచ్చి చాలా మంది నటుల్ని ఇండస్ట్రీకి అందించారు.
1960 కాలంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఫిల్మ్ ఇన్ట్సిట్యూట్ లో కెఎస్ నారాయణ స్వామి యాక్టింగ్ గురువుగా పనిచేశారు. ఆయన్ని అందరూ గోపాలి(KS Gopali) అనే పిలిచేవారు. యాక్టింగ్ గురువుగా ఉంటూనే ఆయన దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. రజినీకాంత్ ఆయన వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు బాలచందర్(bala chandar) కు రజినీని పరిచయం చేసింది కూడా గోపాలినే.
గోపాలి, రజినీకి కేవలం నటన నేర్పించిన గురువుగా మాత్రమే కాకుండా ప్రతీ విషయంలోనూ ఎంతో సపోర్ట్ గా ఉంటూ నిత్యం ధైర్యాన్ని నింపుతూ ఉండేవారని, అందుకే గోపాలి అంటే రజినీకి అమిత ఇష్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. గోపాలి వార్త విన్న వెంటనే రజినీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించగా, ఎందరో సెలబ్రిటీలు ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.













