లోకేష్ యూనివర్స్‌లో రజినీకాంత్?
ఖైదీ, విక్రమ్ సినిమాలతో తన టెక్నికల్ బ్రిలియన్స్ ఏంటో నిరూపించుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ రేంజ్‌కు వెళ్లిన లోకేష్, గత కొన్నేళ్లుగా ఎవరికీ సాధ్యం కాని విధంగా కమల్‌హాసన్‌తో 300 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు. ప్రస్తుతం లోకేష్, విజయ్‌తో లియో అనే సినిమా చేస్తున్నాడు.
లియోపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ మాత్రమే 60 కోట్లకు అమ్ముడయ్యాయంటే లియో క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక మామూలు యాక్షన్ డ్రామాతో ఈ రేంజ్ బిజినస్ అంటే అది లోకేష్ కు ఉన్న బ్రాండ్ వాల్యూ వల్లే సాధ్యమైందని తమిళ నాట అందరూ అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఇటీవలే లోకేష్ కథకు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్చి చేశాడని తెలుస్తోంది. లోకేష్ నెరేషన్ కు బాగా ఇంప్రెస్ అయిన రజినీ, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే లోకేష్ లైనప్‌లో విక్రమ్2, ఖైదీ2, రోలెక్స్లు ఉన్నాయి. వీటిని విడివిడిగా తీయాలా లేక అన్నీ కలిపి ఒక యూనివర్స్ లాగా తీయాలా అనే విషయంలో లోకేష్ ఇంకా డెసిషన్ తీసుకోలేదని తెలుస్తుంది.
కానీ సూర్యతో రోలెక్స్ మాత్రం కేవలం 150 రోజుల్లో తీసేస్తానని లోకేష్ రీసెంట్గా ఓ ఫంక్షన్ లో వెల్లడించాడు. ఇక రజినీ విషయానికొస్తే ప్రస్తుతం జైలర్ షూటింగ్ ముప్పావు వంతు పూర్తైంది. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్‌తో సినిమా చేయాల్సి ఉంది కానీ స్టోరీ విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తుంది. ఇది కాకుండా కూతురు ఐశ్వర్యతో తీస్తున్న మరో సినిమాలో స్పెషల్ క్యామియో చేస్తున్న రజినీ కాంత గ్యాప్ తీసుకున్న తర్వాతే కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.













