రజినీ సైలెంట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా?
ఒకప్పుడు సౌత్ సినిమాలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన రజినీకాంత్ కెరీర్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. అప్పట్లో ఆయన సినిమాల బిజినెస్, కలెక్షన్స్ అన్నీ నెక్ట్స్ లెవెల్ లో ఉండేవి. ఆయన రికార్డుల సరిహద్దుల్లో కూడా మరో హీరో ఉండేవాడు కాదు. రోబో సినిమాతో కెరీర్ లో టాప్ కలెక్షన్లను అందుకుని బాలీవుడ్ స్టార్లకు సైతం ఛాలెంజ్ చేశారు రజినీకాంత్.
అన్నాత్తై సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను అందుకున్న రజినీకాంత్ మార్కెట్ బాగా దెబ్బతింది. తమిళంతో పాటూ తెలుగులో కూడా చాలా మంది హీరోలు రజినీ మార్కెట్‌ను దాటి ముందుకెళ్లిపోయారు. ఆయన సినిమా వస్తుందంటే ఒకప్పుడున్న ఊపు, ఎనర్జీ, హైప్ ఇప్పుడు జనాల్లో కనిపించడం లేదు. రిలీజయ్యాక సినిమా బాగుంటే అప్పుడు చూద్దాంలే అని ఆగిపోతున్నారు.
ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జైలర్. ఈ సినిమా ప్రోమోల దగ్గర నుంచి ఇప్పటి వరకు రిలీజైన కంటెంట్ మొత్తం ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ జైలర్‌కు హైప్ మాత్రం లేదు. జైలర్ కు టాలీవుడ్ లో మాత్రం మరీ తక్కువ బజ్ ఉంది. దానికితోడు నెల్సన్ నుంచి వచ్చిన ఆఖరి సినిమా బీస్ట్ కూడా డిజాస్టర్ కావడంతో జైలర్ పై అంచనాలు తగ్గాయి.
అయితే జైలర్ బజ్ విషయంలో మాత్రం టీమ్ అసలు కంగారు పడట్లేదట. ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీలోని కొందరికి చూపించగా, వారందరికీ సినిమా చాలా బాగా నచ్చినట్లు తెలుస్తోంది. రజినీ స్టైల్ అండ్ స్వాగ్ ఈ సినిమాలో పీక్స్ లో ఉండటుందని, అనిరుధ్ సంగీతం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని, ఫ్యాన్స్ కు హై ఇచ్చే మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయని సమాచారం అందుతుంది. మరి జైలర్ తో సూపర్ స్టార్ సైలెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.













