2021 సంక్రాంతికి రెడీ అవుతున్న రజిని చిత్రం ‘అన్నాతె’
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మధ్య సంక్రాంతి హీరో అయిపోయాడు. గత రెండేళ్లూ కూడా సంక్రాంతికి ఆయన సినిమాలు వచ్చాయి. 2019లో ‘పేట’ రిలీజైతే 2020లో ‘దర్బార్’ సంక్రాంతికి విడుదల అయ్యాయి కానీ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు చిత్రాలు కూడా బోల్తాపడ్డాయి. అయినా సరే 2021 ఏడాది సంక్రాంతికి తన సినిమాను రేసులో నిలబెట్టేశాడు. ఆ సినిమానే.. ‘అన్నాతె’. తెలుగులో ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ చిత్రానికి తెలుగులో శౌర్యం, దరువు, శంఖం చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ ఈ చిత్రాన్నీ రూపొందిస్తున్నారు. ఇతను తొలుత సినిమాటోగ్రాఫర్ తమిళంలో అజిత్‌తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన శివ రజనీకాంత్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసాడు.
ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. సినిమా ఆలస్యమైంది. ఐతే లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో.. షూటింగులు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఈ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఉన్నట్లుండి రిలీజ్ డేట్ గురించి ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘అన్నాతె’ సంక్రాంతికి రిలీజవుతుందని ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ వచ్చే సంక్రాంతికే షెడ్యూల్ అయిన నేపథ్యంలో ఇటు తెలుగులో, అటు తమిళంలో వేరే పెద్ద సినిమాల సందడి లేకపోవచ్చని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ఆ సినిమా సంక్రాంతికి రావడం కష్టమని అర్ధమైంది. తెలుగులో వకీల్ సాబ్ లేదంటే ఆచార్య సంక్రాంతికి వచ్చే అవకాశముంది.అయినా సరే తమిళంలో ముందుగా రజిని మూవీ కి డేట్ ఫిక్స్ చేసారు. అన్నాతెలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. శివ గత సినిమాల స్టయిల్లోనే ఇది కూడా రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే పక్క రజిని స్టయిల్లో ఫుల్ మాస్ సినిమా అని తెలుస్తోంది.













