Rajinikanth: మీ ఫేస్ చూడాలనుందన్న అభిమాని కోసం రజినీ ఏం చేశాడంటే
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్ పై ఎంతో స్టైల్ గా కనిపిస్తూ తన స్వాగ్ తో ఆడియన్స్ ను అలరించే రజినీ రియల్ లైఫ్ లో చాలా నార్మల్ గా కనిపిస్తారు. సడెన్ గా ఆయన ఎదురైతే గుర్తు కూడా పట్టలేనంతగా ఆయన రియల్ లైఫ్ ప్రొఫైల్ ను మెయిన్టెయిన్ చేస్తూ ఉంటారు. అలాంటి రజినీకి సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
అందరిలానే రజినీకాంత్ కూడా ఫ్లైట్ లో సాధారణ మనుషుల్లాగా ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తూ కనిపించారు. రజినీని తమ ఫ్లైట్ లో చూసిన ఫ్యాన్స్ ఇక ఊరుకుంటారా? అరుపులు కేకలతో విమానాన్ని హోరెత్తించారు. అంతేకాదు, తన సీట్ లో కూర్చున్న రజినీని ఓ ఫ్యాన్ వెనుక నుంచి తలైవా మీ ఫేస్ చూడాలనుంది అనగానే ఆయన వెంటనే పైకి లేచి అందరికీ అభివాదం చేసిన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రజినీ ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు? కోట్ల మంది అభిమానులను ఉంచుకుని కూడా ఆయన ఇలా సాధారణంగా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా రజినీ నటించిన కూలీ(coolie) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 14న కూలీ రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
https://x.com/RajiniFollowers/status/1953150829600620988







