Rajinikanth: రజినీ నెక్ట్స్ ఆ డైరెక్టర్ తోనా?
జైలర్(Jailer) సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) రేంజే మారిపోయింది. నెల్సన్(nelson) దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ లోనే రజినీ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో చేసిన కూలీ(coolie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రజినీ రెడీ అవుతున్నారు.
ఆగస్ట్ 14న కూలీ రిలీజ్ కానుండగా, ప్రస్తుతం రజినీకాంత్ జైలర్2(jailer2) సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత రజినీకాంత్ ఎవరితో సినిమా చేయనున్నారనే నేపథ్యంలో ఇప్పటికే పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. వారిలో నిథిలన్ సామినాథన్(nithilan Saminathan), హెచ్ వినోద్(H Vinoth), వివేక్ ఆత్రేయ(Vivek Athreya) లాంటి పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు రజనీ తన తర్వాతి సినిమాను వీరిలో ఒకరితో కాకుండా మరో డైరెక్టర్ తో చేయనున్నట్టు తెలుస్తోంది.
తలైవా తన తర్వాతి సినిమాను కంగువా(Kanguva) డైరెక్టర్ సిరుత్తై శివ(Siruthai Siva) దర్శకత్వంలో చేయనున్నారని అంటున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో అన్నాత్తై సినిమా చేసినప్పటికీ అది ఫ్లాపుగానే నిలిచింది. అయితే రజినీ తన తర్వాతి సినిమాను శివతో చేయడం పట్ల ఫ్యాన్స్ మాత్రం ఏ మాత్రం ఆనందంగా లేరు. మరి ఈ కాంబినేషన్ లో నిజమెంతో చూడాలి. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి(Srinivas Chittori) నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది.







