Rajinikanth: టాలెంటెడ్ డైరెక్టర్ తో సూపర్ స్టార్ సినిమా?

కొలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో కూలీ(Coolie) సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కూలీ ను ఫినిష్ చేసిన రజినీకాంత్ ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson dileep kumar) దర్శకత్వంలో జైలర్(Jailer) సినిమాకు సీక్వెల్ గా జైలర్2(Jailer2) ను చేస్తున్నాడు.
ప్రస్తుతం జైలర్2 సెట్స్ పై ఉంది. అయితే జైలర్ పూర్తయ్యాక రజినీ ఎవరితో సినిమాలు చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే రజినీ లైనప్ పై ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. యంగ్ డైరెక్టర్ హెచ్. వినోత్(H Vinoth) తో సూపర్ స్టార్ ఓ సినిమాను చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వినోత్, విజయ్(Vijay) తో కలిసి జన నాయగన్(Jana Nayagan) అనే సినిమా చేస్తున్నాడు.
జన నాయగన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా, ఆ సినిమా తర్వాత వినోత్, రజినీతో సినిమా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వినోత్ గతంలో ఖాకీ(Khakhee), వలిమై(Valimai), తునివు(Thunivu) లాంటి సూపర్ హిట్ సినిమాలను తీశాడు. జన నాయగన్ తర్వాత కార్తీ(Karthi)తో ఖాకీ2(Khakhee2) కూడా చేయాలని అనుకుంటున్నాడు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో రజినీ జత కడితే కచ్ఛితంగా ఈ ప్రాజెక్టుపై హైప్ పెరగడం ఖాయం.