రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన రజనీకాంత్ దంపతులు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రజినీకాంత్‌కు శుభాకాంక్షలు చెప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రధాని నివాసానికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని కూడా రజినీకాంత్‌ను అభినందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం, అభినందనలు పొందడం చాలా ఆనందంగా ఉన్నదని రజనీకాంత్ అన్నారు. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపు 67వ జాతీయ సినీ అవార్డ్స్ ఉత్సవాల్లో రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు.













