యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుమారుడు ‘రోషన్ కార్తీక్’ తొలి చిత్రం పూజ కార్యక్రమాలు
యాంకర్లు అనే ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. తెలుగు ప్రజలకు సుమ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. గత కొన్నేళ్లుగా సుమ టాలీవుడ్ లో అత్యాధిక పారితోషకం తీసుకునే స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ కుమారుడిని టాలీవుడ్లో హీరో గా పరిచయం చేస్తున్న విషయం విదితమే. అయితే నిన్న ఆదివారం నవంబర్ 1న హైదరాబాద్ లోని ఓ శివాలయం లో ‘రోషన్ కార్తీక్ కనకాల’ ను హీరోగా పరిచయం చేస్తూన్నా తొలి చిత్రం పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజ కార్యక్రమానికి రాజీవి కనకాల, సుమ దంపతులు నిర్మాత హరి బాబు , దర్శకుడు విజయ్ ఇతర కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
పూజ కార్యక్రమాల అనంతరం యాంకర్ సుమ మాట్లాడుతూ : “ఈ రోజు చాలా మంచి రోజని నా కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి ఈ గుడి లో పూజ కార్యక్రమాలు చేసాము దేవుడి అనుగ్రహం తో పాటు మీ ఆశీర్వచనాలు మా బాబు కు ఉండాలని కోరుకుంటున్నాను నిర్మాత హరి బాబు గారికి డైరెక్టర్ విజయ్ గారికి శుభాకాంక్షలు ” అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ : “మా అబ్బాయి రోషన్ కార్తీక్ ని హీరో గా పరిచయం చేస్తున్నాం ఈ చిత్రం ద్వారా విజయ్ కూడా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు జె బి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో హరిబాబు గారు నిర్మిస్తున్నారు. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.” అన్నారు.













