మహేష్ సినిమా కోసం రాజమౌళి కొత్త ప్లాన్
గుంటూరు కారం మిక్డ్స్ టాక్ తోనే మంచి వసూళ్లు రాబడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తన తర్వాతి సినిమాను దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెచర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు బల్క్ లో డేట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి సినిమా అంటే హీరో, హీరోయిన్ తప్ప మిగతా టెక్నికల్ టీమ్ అంతా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. తన ఫ్యామిలీ మొత్తాన్ని రాజమౌలి సినిమాల్లో ఇన్వాల్వ్ చేస్తూంటాడు. అదే ఆయన సక్సెస్ ఫార్ములా అని కూడా అంటుంటారు.
అయితే ఇప్పుడు మహేష్ తో చేయనున్న సినిమాకు రాజమౌళి తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా తన అన్న కీరవాణినే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటూ వచ్చాడు. కానీ మహేష్ సినిమా కోసం రాజమౌళి వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి కథను నెక్ట్స్ లెవెల్ కు ఎలా తీసుకెళ్లాలో కీరవాణిక తప్ప మరోకరికి తెలియదు అనేట్లు ఇప్పటివరకు కీరవాణి సంగీతం ఇస్తూ వచ్చాడు. అలాంటిది మరి మహేష్ సినిమాకు కీరవాణి లేకపోతే అది కచ్ఛితంగా సినిమాకు మైనస్సే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.













