అంచనాలను మించేలా రాజా సాబ్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడనగానే డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి ఎంతో నెగిటివిటీ వచ్చింది. బాహుబలి తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, మీడియం రేంజ్ కామెడీ సినిమాలు తీసుకునే మారుతితో జత కట్టడమేంటన్నది ప్రభాస్ ఫ్యాన్స్ ఆరోపణ. దీనికి తోడు ఈ మధ్య మారుతి ట్రాక్ రికార్డ్ కూడా బాలేదు.
తన చివరి సినిమా పక్కా కమర్షియల్ కూడా డిజాస్టర్ అయింది. కానీ ప్రభాస్ తో మారుతి సినిమా ప్లానింగ్ నెక్ట్స్ లెవెల్ అని నెమ్మదిగా అర్థమవుతుంది. హర్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న సినిమా అనగానే ఈ సినిమాను అందరూ ప్రేమ కథా చిత్రమ్ టైపు సినిమా అనుకున్నారు కానీ రాజా సాబ్ ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టు భారీగా ఉంటుందని హింట్స్ వస్తున్నాయి.
రాజా సాబ్ విజువల్ వండర్ లా ఉంటుందని, ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని పెద్ద బడ్జెట్ లో మంచి క్వాలిటీతో సినిమా తీర్చిదిద్దుతున్నట్లు నిర్మాత ఇప్పటికే వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆడియన్స్ ఊహలకు అందని ఎన్నో విషయాలుంటాయని, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కచ్ఛితంగా థ్రిల్ ఫీలవుతారని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి పలు వార్తలొస్తుండగా, వాటిపై నిర్మాత టిజి విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా చేస్తున్నాడని దాని రిలీజ్ ఫిక్సయ్యాక తమ సినిమా రిలీజ్ డేట్ ను నిర్ణయిస్తామని వెల్లడించాడు.













