Raja Saab: ఆల్మోస్ట్ పూర్తి చేసేసిన రాజా సాబ్

మారుతి(maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న ది రాజా సాబ్(the raja saab). మొదట్లో మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని తెలిసి అందరూ వద్దని సోషల్ మీడియాలో ట్రెండ్స్ కూడా చేశారు. కానీ ప్రభాస్ మాత్రం మారుతిని నమ్మి సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. ప్రభాస్ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకుని ది రాజా సాబ్ ను ది బెస్ట్ గా నిలిపాలని ప్రయత్నిస్తున్నాడు.
ప్రభాస్ ఫ్యాన్స్ మొదట్లో మారుతిని నమ్మనప్పటికీ, ఫస్ట్ లుక్, రీసెంట్ గా రిలీజైన టీజర్ తర్వాత మారుతిని బాగా నమ్మేశారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తై రిలీజవాల్సింది కూడా. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ 95% పూర్తైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ మిగిలిన భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేయనున్నారు మేకర్స్.
ఈ విషయాన్ని రాజా సాబ్ నిర్మాత టి. జి విశ్వ ప్రసాద్(T.G Viswa prasad) స్వయంగా వెల్లడించాడు. రాజా సాబ్ షూటింగ్ 95% పూర్తైందని, మూడు పాటలు, కొంచెం ప్యాచ్ వర్క్ మినహా మొత్తం షూటింగ్ పూర్తైందని తెలిపాడు. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ప్రపంచ స్థాయిలో ఉంటాయని, సినిమాలో త్రీడీ సీజీతో పాటూ అన్ని రకాల సీజీలు ఉంటాయని ఆయన తెలిపారు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని ఆయనెంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.