Raja Saab: ఒక్క భాషకే అంత రేటా రాజా సాబ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The Raja Saab) సినిమా చేస్తున్న ప్రభాస్, మరోవైపు హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fauji) అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో ప్రభాస్ నుంచి మొదటిగా రానున్న సినిమా ది రాజా సాబ్.
మొదట్లో ఈ సినిమాపై మంచి అంచనాలు లేకపోయినా ఎప్పుడైతే సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ వచ్చాయో అప్పట్నుంచి రాజా సాబ్ పై అందరికీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ డీల్స్ గురించి ఓ వార్త వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం రాజా సాబ్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix), చిత్ర యూనిట్ కు ఓ మంచి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేవలం రాజా సాబ్ హిందీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.100కోట్లకు పైగా ఆఫర్ చేసిందని అంటున్నారు. కేవలం ఒక్క భాషకే ఈ రేంజ్ ధర పలికిందంటే రాజా సాబ్ మొత్తం డిజిటల్ రైట్స్ కు ఇంకెంత రేటు పలుకుతుందోనని అంతా భావిస్తున్నారు. తమన్(thaman) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.