The Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్
ప్రభాస్(prabhas) హీరోగా మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్(the raja saab). హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంతో ఈ సారైనా మేకర్స్ చెప్పిన డేట్ కు సినిమాను రిలీజ్ చేస్తారా అని అందరూ అనుమానపడ్డారు. కాగా వారి అంచనాలకు రాజా సాబ్ టీమ్ చెక్ పెట్టింది.
రాజా సాబ్ నుంచి ఫస్ట్ సింగిల్(raja saab first single) ఎప్పుడో ప్రభాస్ బర్త్ డే రోజే రిలీజ్ అవుతుందన్నారు కానీ కొన్ని తెలియని రీజన్స్ వల్ల ఆ సాంగ్ అప్పుడు రిలీజవలేదు. మళ్లీ తర్వాత కూడా అదుగో ఫస్ట్ సింగిల్ ఇదుగో ఫస్ట్ సింగిల్ అన్నారు తప్పించి ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
నవంబర్ 23న రాజ సాబ్ మూవీలోని ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్(Rebel saab) రిలీజ్ కానుందని మేకర్స్ అఫీషియల్ గా ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ లో ప్రభాస్ స్టైల్, రెబల్ సాబ్ స్వాగ్, రాజా సాబ్ వైబ్ తో పాటూ తమన్ మ్యాజికల్ మ్యూజిక్ కూడా ఉంటుందని డైరెక్టర్ మారుతి ఎక్స్ లో పోస్ట్ చేశారు. నవంబర్ 23న ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ఆ తర్వాత వరుసపెట్టి మిగిలిన సాంగ్ ను కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.






