Raja Saab: రాజా సాబ్ కోసం రాజ మహాల్ ఏర్పాటు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రాజా సాబ్(Raja Saab). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్(thaman) సంగీతం అందిస్తున్న రాజా సాబ్ సినిమా హార్రర్ కామెడీ జానర్ లో రూపొందుతుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80% పూర్తైందని తెలుస్తోంది. క్లైమాక్స్ షూటింగ్ ఒక్కటే పెండింగ్ ఉందట. క్లైమాక్స్ కోసం ఓ పెద్ద మహాల్ ను సెట్ వేశారని, రాజా సాబ్ కోసం ఓ రాజ మహాల్ ను ఏర్పాటు చేశారని అందులోనే క్లైమాక్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ప్రభాస్ లాంటి హీరో ఇలాంటి కథ ఎంచుకోవడం కొత్త విషయమనుకునేలా సినిమా ఉంటుందని యూనిట్ వర్గాలంటున్నారు.
థ్రిల్లర్ అంశాలతో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, ఈ సినిమా కోసం మారుతి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజా సాబ్ సినిమా తర్వాత మారుతి పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్ లో చేరడం ఖాయమని అంటున్నారు. మారుతి నుంచి ఎవరూ ఊహించని రీతి సినిమాగా రాజా సాబ్ ఉండబోతుందని, సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, ప్రభాస్ కెరీర్లోనే రాజా సాబ్ ఓ డిఫరెంట్ అటెంప్ట్ సినిమాగా ఉంటుందని అంటున్నారు. రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా లేటవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.













