50 రోజుల్లో 3 డిజాస్టర్లందుకున్న రాజ్ తరుణ్
సినీ ఇండస్ట్రీలో ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న హీరోల నుంచి 50 రోజుల్లో మూడు సినిమాలు రిలీజ్ కావడమే రేర్. ఆ మూడు ఒకదాన్ని మించి మరోకటి ఫ్లాపులుగా మిగలడం ఇంకా రేర్. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ అనవసరమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు.
కానీ ఆ సినిమాలేవీ అనుకన్న ఫలితాన్నివ్వలేదు. ఓ దశ దాటాక అతని ఫ్లాపుల్ని కూడా లెక్కచేయడం మానేశారు ఆడియన్స్. సినిమాల నుంచి మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ గత 50 రోజుల్లో 3 సినిమాలతో ఆడియన్స్ ను పలకరించి తీవ్ర పరాజయాన్ని అందుకున్నాడు. జులై 26న పురుషోత్తముడు రిలీజ్ చేసి ఫ్లాప్ అందుకున్నాడు.
తర్వాత వారం తిరక్కుండానే తిరగబడరా సామీ అనే సినిమాను రిలీజ్ చేశాడు. ఈ సినిమా కంటే ముందొచ్చిన సినిమానే బెటర్ అనుకునేలా ఉందీ సినిమా పరిస్థితి. ఆ తర్వాత మళ్లీ 40 రోజుల గ్యాప్ తో భలే ఉన్నాడే సినిమాను రిలీజ్ చేశాడు. ఈ సినిమా అయినా హిట్ అవుతుందేమో అనుకుంటే అది కూడా తేలిపోయింది. మొత్తానికి చాలా తక్కువ వ్యవధిలో హ్యాట్రిక్ ఫ్లాపులను అందుకున్న రికార్డును రాజ్ తరుణ్ మూట గట్టుకున్నాడు.













