Narne Nithin: జూనియర్ డైరెక్టర్ తో నితిన్ సినిమా

మ్యాడ్(Mad) మూవీ హీరోగా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన నార్నే నితిన్(narne nithin) మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ఆయ్(aay_ మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న నితిన్, మ్యాడ్2(mad2)తో ఇంకో హిట్ కొట్టాడు. ఆల్రెడీ మ్యాడ్3(mad3)ను పట్టాలెక్కించిన నితిన్, వరుస సినిమాలను లైన్ లో పెడుతూ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే నితిన్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. నార్నే నితిన్ ఇప్పుడు మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యారని సమాచారం. రీసెంట్ గా కిరీటి రెడ్డి(kireeti reddy) హీరోగా పరిచయమైన జూనియర్(junior) కు దర్శకత్వం వహించిన రాధాకృష్ణ రెడ్డి(radhakrishna reddy) తో కలిసి నితిన్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుందని, అతి త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఏ జానర్ లో రానుంది, ఎవరెవరు నటిస్తున్నారు, టెక్నికల్ టీమ్ కు సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. కాగా నితిన్ రీసెంట్ గానే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే.