పీపుల్స్ స్టార్ కు దాసరి అవార్డు
దాసరి పేరున అవార్డులను ప్రదానం చేస్తున్న పాన్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-దాసరి 2019 అవార్డులను ఈ నెల 28న రాజమహేంద్రవరం, విక్రమ్ హాలులో అందజేయనున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె.ధర్మరావు తెలిపారు. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు రాజు వన్నెంరెడ్డి, నిర్మాత సి.కల్యాణ్, అవార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులకు కూడా అవార్డులను అందజేయనున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రతేజ, లలితారావు పాల్గొంటారని, ముక్కామల క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శ్రీధర స్వామీజీ ఆశీస్సులు అందిస్తారని తెలిపారు.













